Kalyan Ram: తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో నందమూరి కళ్యాణ్ రామ్. దివంగత నటుడు హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగానూ, నిర్మాతగానూ రాణిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా ముందుకు సాగుతున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ సినిమా ఈవెంట్స్, పార్టీలు, ఫంక్షన్లలో కలిసి తరచూ కనిపిస్తారు. అలాగే కళ్యాణ్ రామ్.. తారక్ సినిమాల పూజ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులతో సరదాగా గడపడం చాలా సార్లు చూశాం. అయితే ఈ హీరో ఫ్యామిలీ మాత్రం బయట పెద్దగా కనిపించదు. కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు.
Read Also:RK Roja: పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి
కళ్యాణ్ రామ్ భార్య స్వాతి.. కొడుకు శౌర్యరామ్, కూతురు తారక అద్వైత. వాళ్లంతా మీడియాకు దూరంగా ఉంటారు. చాలా కాలం తర్వాత కళ్యాణ్ రామ్ పిల్లల ఫోటోలు బయటకు వచ్చాయి. ఇటీవల కల్యామ్ రామ్ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. భార్య స్వాతి, పిల్లలతో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా.. అక్కడ ఈ ఫ్యామిలీ మీడియా కంట పడింది. దీంతో కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ విజువల్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. అందులో కళ్యాణ్ రామ్ కొడుకు, కూతురుని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కనిపించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి ప్రత్యక్షమయ్యారు. కళ్యాణ్ రామ్ కొడుకు అప్పుడే ఇంత పెద్దవాడు అయిపోయాడా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. కళ్యాణ్ రామ్ తనయుడు శౌర్యరామ్ ను చూసి మరో నందమూరి వారసుడు సిద్ధమవుతున్నాడని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also:Vivo Y28s 5G Price: వై28ఎస్ 5జీ ఫోన్ ధరను తగ్గించిన వివో.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్ అదనం!
బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో కళ్యాణ్ రామ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ పై నిర్ణయం తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ హీరో నిర్మాతగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బింబిసార సినిమాతో భారీగా వసూళ్లు రాబట్టిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు దేవర సినిమాతో నిర్మాతగా పెద్ద విజయాన్ని అందుకున్నాడు.
Kalyan Ram garu with family 😍#NKR #KalyanRam #NandamuriKalyanRam pic.twitter.com/z2BlRcvYcF
— Sae Sarath NTR (@sarathtarak9) October 5, 2024