NTV Telugu Site icon

Delhi : నేడు మరోసారి ఈడీ ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

Kavitha

Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ఇవాళ మళ్లీ విచారించనున్నారు. ఈ మేరకు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి తొలిసారిగా ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు.. రెండోసారి సోమవారం ప్రశ్నించారు. 11న జరిగిన విచారణకు కొనసాగింపుగా పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ లావాదేవీలు, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారితో హైదరాబాద్, ఢిల్లీ హోటళ్లలో సమావేశమయ్యారనే ఆరోపణలపై ప్రశ్నించినట్లు తెలిసింది.

Also Read : Bhakthi Tv Hanuman Chalisa Live: శుభకృత్ నామసంవత్సరం చివరి మంగళవారం హనుమాన్ చాలీసా వింటే…

ఉదయం కవిత బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లైతో కలిసి.. ఆ తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ కమ్యూనికేషన్ల ఇన్ చార్జ్ విజయ్ నాయర్ లతో కలిపి విచారించారనే వార్తలు వచ్చినప్పటికీ.. కవిత ఒక్కరినే ఈడీ వర్గాలు ప్రశ్నించినట్లు వెల్లడించాయి. అరుణ్ పిళ్లై నుంచి పదిసార్లకు పైగా వాంగ్మూలాలు సేకరించిన ఈడీ అధికారులు.. ఆయా వాంగ్మూలాల్లో కవిత ప్రస్తావన ఉన్న అంశాలపై ఆమెను క్వశ్చనింగ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఎమ్మెల్సీ కవితను దాదాపు 10 గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు.

Also Read : Tuesday Falguna Amavasya Bhakthi Tv Live: ఫాల్గుణ అమావాస్యనాడు ఈ స్తోత్రాలు వింటే..

మద్యం వ్యాపారంలో పిళ్లై వాటా 32.5 శాతానికి గానూ ఎంత పెట్టుబడి పెట్టారు..? కిక్ బ్యాకల్ రూపంలో వెనక్కి ఏ మేరకు వచ్చింది..? పిళ్లైతో కలిసి ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపారం విస్తరించాలనుకోవడం? లాంటి ఇతర ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియాలతో ఏయే అంశాలు చర్చించారని కూడా అడిగినట్లు సమాచారం. ఢిల్లీ, హైదరాబాద్ హోటళ్ల నుంచి తెప్పించిన పలు రికార్డులు ముందు పెట్టి, ఆయా సమావేశాల్లో ఏయేం మాట్లాడారని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.