Delhi: సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ.. ఏ నిర్ణయం తీసుకున్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. శనివారం ఆమె… సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ, కేజ్రీవాల్ జైలు కెళ్లిన పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవలే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కల్పనా సోరెన్-సునీతా కేజ్రీవాల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిగిస్తున్న తీరుపై కలిసి పోరాడాలని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కల్పనా సోరన్ మీడియాకు తెలియజేశారు. అలాగే సోనియాగాంధీని కూడా కలిసి జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆదివారం ఇండియా కూటమి పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కూటమిలో ఉన్న అన్ని పార్టీల ముఖ్య నేతలంతా హాజరుకానున్నారు. రాంలీలా మైదాన్‌లో జరిగే ఈ మహా ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కల్పనా సోరెన్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ఓబ్రెయిన్, డీఎంకే నేత తిరుచ్చి శివ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ పాల్గొంటారు. ఈ ర్యాలీలో కేంద్రం తీరు, ఈడీ దాడులపై నేతలు ధ్వజమెత్తనున్నారు. దీంతో పాటు ఎలక్టోరల్ బాండ్ల అంశం, ఐటీ నోటీసులు, ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులపై లేవనెత్తారు.

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్‌ను అమెరికా సహా ఐక్యరాజ్యసమితి తప్పుపట్టింది. అయితే తమ దేశ విషయంలో జోక్యం చేసుకోవద్దని కేంద్రం సూచించింది. హేమంత్ సోరెన్ కూడా మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. దాదాపు రెండు నెలల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఇంకా ఆయనకు బెయిల్ లభించలేదు. మొత్తానికి ఢిల్లీ వేదికగా ఆదివారంపై కేంద్రం అనుసరిస్తున్న పోకడలపై ఇండియా కూటమి ధ్వజమెత్తనుంది.
ఇది కూడా చదవండి: USA: పాకిస్తాన్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నాం.. పాక్ పీఎంకు బైడెన్ లేఖ..
#WATCH | Kalpana Soren, wife of JMM leader and former Jharkhand CM Hemant Soren says "The incident that took place in Jharkhand 2 months back, the same is now going on in Delhi. CM Arvind Kejriwal has also been sent to jail just like my husband Hemant Soren… I met Sunita… pic.twitter.com/h5Q1CujBYf
— ANI (@ANI) March 30, 2024
#WATCH | Kalpana Soren, the wife of Jharkhand Mukti Morcha (JMM) leader and former CM Hemant Soren meets Sunita Kejriwal, wife of Delhi CM Arvind Kejriwal. pic.twitter.com/SVLAkLCpbW
— ANI (@ANI) March 30, 2024
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్‌తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్‌కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!