NTV Telugu Site icon

Kalki 2898 AD : కల్కి రిలీజ్ ట్రైలర్ అదిరింది.. కానీ అదొక్కటే మైనస్..?

Kalki

Kalki

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా  తెరకెక్కించాడు.ఇండియన్ మైథలాజి కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ,పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.రీసెంట్ గా ఈ చిత్రం నుండి ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో ఎంతో రిచ్ గా తెరకెక్కించారు.ఫస్ట్ ట్రైలర్ తోనే మెప్పించిన నాగ్ అశ్విన్ తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.

Read Also :Rashmika Mandanna : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ఓకే చెప్పిన నేషనల్ క్రష్..?

ఈ ట్రైలర్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా కట్ చేసారు.గ్రాండ్ విజువల్స్ తో పాటు ఎమోషన్ ను కూడా ఎంతో అద్భుతంగా చూపించారు.ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తుంది.స్టార్ డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ ,రాజమౌళి ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వారు తెలిపారు.అంతా బాగానే వుంది కానీ కల్కి రిలీజ్ ట్రైలర్ లో ఒకటే మైనస్..ఈ ట్రైలర్ లో సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేదని కామెంట్స్ వస్తున్నాయి.కానీ ఇది ట్రైలర్ మాత్రమే అని సినిమా మొత్తం మీద సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి గూస్ బంప్స్ వస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది.

 

Show comments