స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ సినిమా నుండి ఓ స్క్రాచ్ వీడియో-4 ను మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు. సినిమాలోని ‘బుజ్జి’ పాత్రను పరిచయం చేస్తూ.. వీడియో అమాంతం సాగింది. ఇక ”బుజ్జి” అంటే హీరో ప్రభాస్ వాడే వాహనంగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియోలో ‘నా లైఫ్ అంతే. బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో’ అని బుజ్జి చెప్పగా.. ‘నీ టైమ్ మొదలైంది బుజ్జి’ అంటూ ప్రభాస్ ఆ వాహనాన్ని చూపించే యత్నం చేస్తాడు.
Vijayashanti : పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి
ఇక అంతలోనే ఓ ట్విస్ట్ ఇచ్చిన మేకర్స్ బుజ్జిని మే 22న రివీల్ చేస్తామని తెలిపారు. కాగా, ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ నేపథ్యంలో వస్తుంది. మహానటి ఫేం నాగ్ అశ్విన్ ఈ సినిమాకు డైరెక్టర్ గా చేస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా కోసం సినిమా ఆడియన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ చిత్రం లో అమితాబ్, కమల్‌హాసన్, దీపిక పదుకొణే, దిశా పటానీ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్ లకు చాలా మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న సంగతి విదితమే.