NTV Telugu Site icon

Kalki 2898 AD Story: ‘కల్కి’గా ప్రభాస్.. సినిమా స్టోరీ ఇదేనా?

Prabhas Poster Kalki

Prabhas Poster Kalki

Prabhas, Nag Ashwin Film Kalki 2898 AD Story Line Leak: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్‌, గ్లింప్స్‌ వచ్చేశాయి. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ ప్రతిష్ఠాత్మక ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ వేడుకలో చిత్ర యూనిట్ గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించింది. ఈ సినిమాకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇక గ్లింప్స్‌లోని యాక్షన్‌ సీన్స్‌, విజువల్స్‌, ప్రభాస్ లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కల్కి 2898 ఏడీ నామస్మరణంతో ఊగిపోతోంది. మరోవైపు సినిమా స్టోరీ లైన్‌ ఇదే అంటూ చర్చలు మొదలయ్యాయి.

‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది. అప్పుడు అంతం అరంభమవుతుంది’ అని గ్లింప్స్‌ ద్వారా చిత్ర యూనిట్ చెప్పింది. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఓ శక్తిలా కల్కి ఉద్భవిస్తాడని చెప్పకనే చెప్పారు. ఇక కొన్ని దుష్టశక్తులు ప్రజలను బందీలను చేస్తే.. వారిని రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్‌ను చూపించారు. దాంతో కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. కలియుగ అంతానికి కారణం కల్కి దేవుడు అని, శ్రీ మహావిష్ణవు ఆఖరి అవతారమే ఈ కల్కి అని పురాణాలు చెపుతున్నాయి.

Also Read: Prabhas-Ram Charan: ఏదో ఒక రోజు రామ్‌ చరణ్‌తో సినిమా చేస్తా: ప్రభాస్‌

ప్రపంచాన్ని దుష్ట శక్తులు ఏలుతున్న సమయంలో.. వారిని మట్టికరిపించడానికి టైం ట్రావెల్ మెషిన్ ద్వారా 2898లో జన్మించబోయే కల్కిని 2024వ సంవత్సరంలోకి తీసుకొని రావడమే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా అని నెట్టింట అంటున్నారు. టైటిల్ ప్రకారం ఈ సినిమా 2898లో జరుగనుందని పేర్కొంటున్నారు. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ‘కల్కి 2898 ఏడీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Also Read: Sweet Corn Health Benefits: స్వీట్‌కార్న్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వయసుని కూడా తగ్గిచేస్తుంది!