Prabhas: ప్రభాస్ది వేరే లెవెల్.. నీలాంటి వాడు చేసే ఛీప్ కామెంట్స్‌ను పట్టించుకోరు: సుధీర్ బాబు
- ప్రభాస్‌పై అర్షద్ వార్సీ వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో తీవ్ర దుమారం
- అర్షద్ వార్సీకి సుధీర్ బాబు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudheer Babu Fires on Arshad Warsi: ‘కల్కి 2898 ఏడీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాత్ర జోకర్లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభాస్ అభిమానులు అర్షద్ కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్‌ను చులకన చేసి మాట్లాడడంపై ఇప్పటికే నిర్మాతలు ఎస్కేఎన్, అభిషేక్ అగర్వాల్ స్పందించారు. తాజాగా అర్షద్‌కు ‘నవ దళపతి’ సుధీర్ బాబు కౌంటర్ వేశారు. ప్రభాస్ది వేరే లెవెల్ అని, నీలాంటి వాడు చేసే ఛీప్ వ్యాఖ్యలను ఆయన అస్సలు పట్టించుకోరన్నారు.
సుధీర్ బాబు మంగళవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘నిర్మాణాత్మకంగా విమర్శిస్తే పర్వాలేదు కానీ.. ఇలా కించపరిచేలా మాట్లాడడం సరికాదు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్ అర్షద్ వార్సీ నుంచి వస్తాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. ప్రభాస్ స్థాయి చాలా పెద్దది. కుంచిత మనస్తత్వంతో చేసే వ్యాఖ్యలను ఆయన అస్సలు పట్టించుకోరు’ అని సుధీర్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read
Also Read: ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ.. అందరి కళ్లు జై షా పైనే!
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఆగస్టు 15 నాటికి కల్కి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా పలుచోట్ల ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతోంది. ఆగస్టు 22 నుంచి కల్కి మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఇందులో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించారు.
It’s okay to criticize constructively but it’s never okay to bad-mouth. Never expected the absence of professionalism from Arshad Warsi. Prabhas’s stature is too big for comments coming from small minds..
— Sudheer Babu (@isudheerbabu) August 20, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు