Site icon NTV Telugu

Prabhas: ప్రభాస్‌ది వేరే లెవెల్.. నీలాంటి వాడు చేసే ఛీప్ కామెంట్స్‌ను పట్టించుకోరు: సుధీర్ బాబు

Prabhas

Prabhas

Sudheer Babu Fires on Arshad Warsi: ‘కల్కి 2898 ఏడీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ పాత్ర జోకర్‌లా ఉందని బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభాస్‌ అభిమానులు అర్షద్‌ కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్‌ను చులకన చేసి మాట్లాడడంపై ఇప్పటికే నిర్మాతలు ఎస్‌కేఎన్, అభిషేక్ అగర్వాల్‌ స్పందించారు. తాజాగా అర్షద్‌కు ‘నవ దళపతి’ సుధీర్ బాబు కౌంటర్ వేశారు. ప్రభాస్‌ది వేరే లెవెల్ అని, నీలాంటి వాడు చేసే ఛీప్ వ్యాఖ్యలను ఆయన అస్సలు పట్టించుకోరన్నారు.

సుధీర్ బాబు మంగళవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘నిర్మాణాత్మకంగా విమర్శిస్తే పర్వాలేదు కానీ.. ఇలా కించపరిచేలా మాట్లాడడం సరికాదు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్‌ అర్షద్ వార్సీ నుంచి వస్తాయని నేను ఎప్పుడూ ఊహించలేదు. ప్రభాస్‌ స్థాయి చాలా పెద్దది. కుంచిత మనస్తత్వంతో చేసే వ్యాఖ్యలను ఆయన అస్సలు పట్టించుకోరు’ అని సుధీర్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం సుధీర్ బాబు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read: ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికపై ఉత్కంఠ.. అందరి కళ్లు జై షా పైనే!

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్‌ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు. ఆగస్టు 15 నాటికి కల్కి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా పలుచోట్ల ఈ మూవీ థియేటర్లలో రన్‌ అవుతోంది. ఆగస్టు 22 నుంచి కల్కి మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఇందులో అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ నటించారు.

Exit mobile version