Site icon NTV Telugu

Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇట్స్ అఫీషియల్..

Kalki 2898

Kalki 2898

Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘కల్కి’ ఓటీటీ రిలీజ్‌ కు సిద్ధమైంది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ పాట్నర్ అమెజాన్ ప్రైమ్‌ ప్రకటించింది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని నేడు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘కల్కి’ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

Heroine Poster: హీరోయిన్ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ పోస్టర్ విడుదల

ఇక కల్కి మొదటి పాటు భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి కల్కి పార్ట్-2 పైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి రోజుల్లో షూటింగ్ జరిగిందని సినిమాకు సంబంధించి 20% వరకు పూర్తయిందని ఇంకా ముఖ్యమైన యాక్షన్స్ సన్నివేషాలు చిత్రీకరించాల్సి ఉందని ఇదివరకే దర్శకుడు తెలియజేశారు. ఇక కల్కి 2 సీక్వెల్ లో హీరో ప్రభాస్, కమలహాసన్ అలాగే అమితాబచ్చన్ మధ్య జరిగే భారీ యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా కర్ణుడు, అశ్వద్ధామ, యాస్కిన్ పాత్రల మధ్య జరిగే శక్తివంతమైన ధనస్సు కీలకం కాబోతున్నట్లు ఆయన చెప్పకనే చెప్పేశారు. మొదటి పార్ట్ లో యాస్కిన్‌ పాత్రకు పెద్దగా అవకాశం లేకపోయినా.. అదే సీక్వెల్ లో మాత్రం యాస్కిన్‌ పాత్రకు నిడివి చాలా ఎక్కువగా ఉంటుందని హీరో కమలహాసన్ ఇదివరకే తెలిపారు. చూడాలి మరి కల్కి 2 ఇంకా ఎన్ని రికార్డులను కొల్లబడుతుందో.

Suicide Attempt: అటల్‌ సేతు బ్రిడ్జిపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళ.. పోలీసుల రాకతో..?

Exit mobile version