Heroine Poster: హీరోయిన్ పుట్టినరోజు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ పోస్టర్ విడుదల
- పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' పోస్టర్ విడుదల
- ఇప్పటి వరకు చేయని చారిత్రాత్మక యోధుడు పాత్రలో పవన్ కళ్యాణ్
- కొంత విరామం తర్వాత ఆగస్టు 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్
- నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్
- మహాలక్ష్మి దేవి అవతారంగా బంగారు చీరలో అద్భుతంగా కనిపిస్తున్న నిధి అగర్వాల్
- యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nidhi Aggarwal In Hari Hara Veeramallu poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సినీ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అందించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు చేయని చారిత్రాత్మక యోధుడు పాత్రలో ఆయన కనిపించనున్నారు. కొంత విరామం తర్వాత ఆగస్టు 14 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇక ఇప్పుడు చిత్ర బృందం మరో అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌తో శుభాకాంక్షలు తెలిపారు. పోస్టర్‌లో నిధి మహాలక్ష్మి దేవి అవతారంగా, బంగారు చీరలో, అద్భుతంగా కనిపిస్తున్న నగలతో మెరుస్తోంది. తనదైన అందంతో ఆమె మాయ చేసేలా కనిపిస్తోంది. ఇక మూవీలో అణగారిన వర్గాల కోసం పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక యోధుడిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.
Also Read: Devara : 100 మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్న “చుట్టమల్లె” సాంగ్
Also Read
యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకొని, సినీ ప్రేమికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ సంచలన నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ సహా అనేక మంది ప్రముఖ నటీనటులు కూడా భాగమయ్యారు. మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ త్వరలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Wishing our #PANCHAMI, the beautiful and amazingly talented @AgerwalNidhhi a fabulous birthday! – Team #HariHaraVeeraMallu 🗡️🔥#HBDNidhhiAgerwal 💫
Power Star 🌟 @PawanKalyan @AMRathnamOfl @thedeol @AnupamPKher @amjothikrishna @mmkeeravaani @ADayakarRao2 pic.twitter.com/xuLjbIzIHa
— Hari Hara Veera Mallu (@HHVMFilm) August 17, 2024
తాజావార్తలు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!