ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ప్రభాస్ లైనప్‌లో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ కల్కి 2 కూడా ఒకటి. గతేడాది జూన్‌లో రిలీజైన కల్కి మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రభాస్‌కు రెండో వెయ్యి కోట్ల సినిమాగా నిలిచింది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే కీలక పాత్రల్లో నటించారు. అయితే, సెకండ్ పార్ట్ నుంచి దీపికను తప్పించారు మేకర్స్. అందుకు.. ఆమె పెట్టిన కండీషన్స్ అనే వార్తలు వచ్చాయి.
Also Read : PSPK32 : పవర్ స్టార్.. సురేందర్ రెడ్డి సినిమా అప్డేట్ వచ్చేసింది.. షూట్ స్టార్ట్ ఎప్పుడంటే?
కానీ, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు? అంటే, క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇప్పటికే హను రాఘవపూడి ‘ఫౌజీ’ షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుండగా.. రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. ఏక కాలంలో ఈ రెండు సినిమాల షూటింగ్‌ను హ్యాండిల్ చేస్తున్న డార్లింగ్.. ఇప్పుడు కల్కి 2 కోసం కూడా డేట్స్ ఇచ్చాడనే న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ 2026 ఫిబ్రవరి నుంచి కొన్ని రోజులు కల్కి 2 కోసం కేటాయిస్తారని తెలుస్తోంది. పార్ట్ వన్ సమయంలోనే కొంత మేర షూటింగ్ చేసి పెట్టుకున్నాడు నాగ్ అశ్విన్. కానీ, ప్రజెంట్ ప్రభాస్ డేట్స్ అడ్జెస్ట్ అవడం లేదు. అయితే, ఇప్పుడు ఫిబ్రవరిలో కొన్ని రోజులు డేట్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. నిజానికి, సెకండ్ పార్ట్ విఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం చాలా సమయం పట్టేలా ఉంది. అందుకు సంబంధించిన సన్నివేశాలను ముందు షూట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ, ఒకేసారి ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్, ఆ లుక్స్‌ని ఎలా మెయింటేన్ చేస్తాడనే విషయమే ఇక్కడ అంతుబట్టకుండా ఉంది.
