Kaleshwaram Temple: భక్తులకు ముఖ్య గమనిక.. లక్షపత్రి పూజలు రద్దు, డిసెంబర్ 8 వరకు ప్రత్యేక పూజలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Temple News: పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో 2026 కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ బాలాలయం, శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి ఆలయాల్లో ఈ రోజు నుంచి డిసెంబర్ 8 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఉప ప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్ర శర్మ తెలిపారు. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరానికి తరలివచ్చారు.
భక్తులు త్రివేణి సంగమం వద్ద గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి.. గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. శ్రీ బాలాలయంలోని దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్నారు. మహిళలు ఆలయాల్లో కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నెల రోజుల పాటు ఆకాశ దీపం వెలిగించనున్నట్లు అర్చకులు ఫణీంద్ర శర్మ వెల్లడించారు.
Also Read
- Kadem Project: ఫలించిన రైతుల పోరాటం.. 700 క్యూసెక్కుల నీరు విడుదల!
- AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 30కి పైగా అంశాలపై ఫోకస్..!
- Karthika Masam 2026: రాజన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు.. నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు!
- Best Flour for Winter: జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?.. చలికాలంలో ఏ పిండి రొట్టెలు తినాలి..?
ఈ నెల 13న నాగులచవితి, 23న వైకుంఠ చతుర్దశి సందర్భంగా శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి ఆలయంలో రాత్రి లింగోద్భవ పూజ నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. అలాగే 24న కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు కార్తీక మాసంలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు. ప్రతిరోజూ దీపారాధన చేయడంతో పాటు ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించాలని కోరారు. ఇక కాళేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థలాభావం కారణంగా ఈ ఏడాది శ్రీ ఆదిముక్తీశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే లక్షపత్రి పూజలను రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Kaleshwaram Temple: భక్తులకు ముఖ్య గమనిక.. లక్షపత్రి పూజలు రద్దు, డిసెంబర్ 8 వరకు ప్రత్యేక పూజలు!
-
Kadem Project: ఫలించిన రైతుల పోరాటం.. 700 క్యూసెక్కుల నీరు విడుదల!
-
AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. 30కి పైగా అంశాలపై ఫోకస్..!
-
Karthika Masam 2026: రాజన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు.. నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు!
-
Best Flour for Winter: జొన్న, రాగి, మొక్కజొన్నలో ఏది బెస్ట్?.. చలికాలంలో ఏ పిండి రొట్టెలు తినాలి..?
ట్రెండింగ్
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!