Site icon NTV Telugu

Uttam Kumar Reddy : తప్పుడు నిర్మాణంతో కాలేశ్వరం అనర్థ దిశగా.. మంత్రి ఉత్తమ్‌ కీలక వ్యాఖ్యలు

Uttam

Uttam

Uttam Kumar Reddy : హుజూర్నగర్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. నిజాలు బయటపడేందుకు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల ఫౌండేషన్‌లోనే లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. “బెరాజీలు కూలిపోయే పరిస్థితి వస్తే ప్రభుత్వంగా విచారణ జరపాల్సిన బాధ్యత మాపై ఉంటుంది,” అని మంత్రి అన్నారు. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Mani Ratnam : భారీ కలెక్షన్స్ కోసమే సినిమాలు చేయొద్దు.. మణిరత్నం హాట్ కామెంట్స్..

ఘోష్ కమిషన్‌కు నోటీసులు అందిన తర్వాత బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు ప్రజలు ఖండిస్తున్నారని మంత్రి చెప్పారు. “బీఆర్ఎస్ హయాంలోనే ఇంజనీర్లు ప్రాజెక్టు లోపాలను గుర్తించి, NDSAకి నివేదిక ఇచ్చారు,” అని గుర్తు చేశారు. సమస్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిషన్‌ను బద్నాం చేయడం బాధాకరమన్నారు. “నిర్మాణం మొదలై నెల రోజుల్లోనే ఇంజనీర్లు లోపాలు గుర్తించారు. కానీ, కమీషన్ల కోసం నాలుగేళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు,” అని మంత్రి విమర్శలు గుప్పించారు. తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే రైతులకు మేలు జరిగేది అన్నారు.

కాలేశ్వరం నిర్మాణం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ దెబ్బతిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత సాగునీటి ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాల్సిన కాలేశ్వరం తప్పుదోవ పట్టడం బాధాకరమన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ చూస్తే స్పష్టంగా కనిపిస్తున్నది ఒక్కటే – గత పాలనలో జరిగిన అవకతవకలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా రంగంలోకి దిగినట్టు ఉంది. ఇక ప్రజలు కూడా ఈ విచారణల్లో నిగ్గు తేలే నిజాల కోసం ఎదురు చూస్తున్నారు.

Tej Pratap Yadav: 12 ఏళ్ల రిలేషన్.. గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన లాలూ పెద్ద కొడుకు..

Exit mobile version