NTV Telugu Site icon

Kaleshwaram Commission : ఏఈఈ-డీఈఈ ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్‌ చీఫ్‌ అసహనం

Kaleshwaram Kamission

Kaleshwaram Kamission

Kaleshwaram Commission : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కుంగుబాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ నేతృత్వంలో కాళేశ్వర కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ క్రమంలోనే నేడు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన DEE -AEE లను కమిషన్‌ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ విచారించించారు. విచారణలో AEE – DEE ఇంజనీర్లపై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి ముందుగా అనుకొని వచ్చి పొంతన లేని సమాధానాలు చెప్పొద్దు అని కమిషన్ చీఫ్‌ వ్యాఖ్యానించారు. ఫీల్డ్ లో జరిగిన పనులకు సంబంధించిన రిజిస్టర్లను సంతకాలు చేసుకున్న కమిషన్.. రిజిస్టర్లలో ఇంజనీర్ల చేత సంతకాలు తీసుకున్నారు. మేడిగడ్డ బ్లాక్ 7కు సంబంధించిన ఫీల్డ్ వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్ లను సంతకాలు చేయించుకున్నారు. కాళేశ్వరంలో జరిగిన పనులపై ప్లేస్మెంట్ రికార్డులు రోజువారిగా చేశారా లేదా? ఒకరోజు పనిని మరొక రోజు నమోదు చేశారని కమిషన్‌ ప్రశ్నించింది.

Kollywood : తమిళ సెలబ్రిటీల్లో పెరుగుతున్న విడాకుల కల్చర్

కుంగిన పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ 7 రిజిస్టర్ లపై ఇంజనీర్ల సంతకాలు తీసుకుంది కమిషన్. 2020లోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజనీర్లు తెలిపారు. మొదటి డ్యామేజీ 2020లోనే జరిగినట్లు గుర్తించి లేఖలు రాసినట్లు కమిషన్ ముందు ఇంజనీర్లు చెప్పినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు కమిషన్ గుర్తించింది. మేడిగడ్డ బ్లాక్ 7తో పాటు మూడు బ్యారేజీలకు సంబంధించిన వర్క్ ప్లేస్మెంట్ రిజిస్టర్ లను స్వాధీనం చేసుకుంది కాళేశ్వరం కమిషన్.

Mollywood : బ్లాక్ బస్టర్ హిట్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ‘నజ్రియా’