జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజులకు వరద పోటెత్తింది. కాళేశ్వరం వద్ద జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న ప్రాణహిత నది వరదతో గోదావరి పోటెత్తింది. మహారాష్ట్రలో ఎగువన గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి 10.090 మీటర్ల ఎత్తుకు నీటిమట్టం పెరిగింది. వరదనీరంతా దిగువకు మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజీకి వెళ్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీపంపుహౌస్లో వర్షాల కారణంగా మోటార్లను సీఎంవో కార్యాలయం ఆదేశాలతో ఇంజనీరింగ్ అధికారులు నీటి పంపింగ్ నిలిపివేశారు. ఈనెల 3 నుంచి మంగళవారం రాత్రి వరకు నీటిని ఎత్తిపోశారు. ఇప్పటి వరకు 16 రోజుల్లో అన్నారం(సరస్వతీ) బ్యారేజీకి 9 టీఎంసీల నీటిని గ్రావిటీకాల్వ ద్వారా తరలించారు.
Also Read : Rashi Khanna: నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు… దయలేదా అసలు
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది .దీంతో బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉండగా 57 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. ఇన్‌ఫ్లో 4,38,880 క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 4,85,030 క్యూసెక్కులు దిగువకు తరులుతుంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుతం
7.646 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అన్నారం సరస్వతీ బ్యారేజ్ వరద తాకిడి మొదలైంది. బ్యారేజ్ లోని 66 గేట్లలో 15 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు కాళేశ్వరం వైపు విడుదల చేస్తున్నారు.
Also Read : IND vs WI Dream11 Prediction: భారత్, వెస్టిండీస్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
ఇన్ ఫ్లో 15,400 కాగా ఔట్ ఫ్లో 18,900 క్యూసెక్కులు తరులుతుంది. బ్యారేజ్ సామర్థ్యం 10.87 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 8.10 టిఎంసిల నీరు నిల్వ ఉంది. అన్నారం బ్యారేజ్ దిగువన ఉన్నా గ్రామాల ప్రజలు వరద ఉధృతి పెరిగితే పంట చేన్లు మునిగిపోతాయని, గ్రామాల్లోకి నీరు వస్తుందని భయాందోళనకి లోనవుతున్నారు.