NTV Telugu Site icon

Kaleru Venkatesh: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కాలేరు వెంకటేష్‌.. కేసీఆర్ హ్యాట్రిక్ పక్కా

Kaleru 3

Kaleru 3

Kaleru Venkatesh: ఈ ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్‌ విజయం సాధించారు.. తెలంగాణ బీఆర్ఎస్‌ సర్కార్‌ హ్యాట్రిక్‌ కొడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్‌ అభ్యర్థి, అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌.. తన నియోజకవర్గం అంబర్‌పేట్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నల్ల పోచమ్మ గుడి నుంచి పాదయాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారు.. అదే అంశాన్ని ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ మహిళలకు వివరించడం జరిగింది. ఈ ప్రచారంలో మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది.. మహిళల నుంచి వస్తున్న స్పందన ద్వారా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం తప్పకుండా సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.

Read Also: China: నేరుగా దాడిచేయలేక.. పండుగను అడ్డం పెట్టుకుని వెన్నుపోటుకు రెడీ అయిన చైనా

ఇక, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ నిర్వహించిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.. భారీ సంఖ్యలో కార్యకర్తలతో అంబర్‌పేట్‌ బస్తీలలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత పది ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను మరియు నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను మహిళలకు వివరించడం జరుగుతుంది.. దాంతో మహిళల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విజయం సాధిస్తారని.. హ్యాట్రిక్‌ కొడతారని తెలిపారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్.

 

 

 

Show comments