NTV Telugu Site icon

Kala Venkata Rao: జైలులో చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది..

Kala

Kala

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారు. అయితే, ఇవాళ చంద్రబాబుతో నారా లోకేశ్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ములాకాత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు కుటుంబ సభ్యులు చంద్రబాబుతో ములాకాత్ అయ్యారు. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కళా వెంకట్రావు మాట్లాడుతూ.. జైలులో చంద్రబాబుకు ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది అని ఆయన ఆరోపించారు.

Read Also: Health Tips: ఇంట్లోనే సర్వరోగ నివారిణి.. వాటితో ఆరోగ్య సమస్యలకు చెక్..!

ఇంత వరకు ఉపశమనం లేదు అని టీడీపీ నేత కళా వెంకట్రావ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కక్షపూరిత చర్యే.. 40 రోజులు గడిచిన ఇంకా కక్ష సాగిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షస క్రీడలా వ్యవహరిస్తున్నారు.. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ రిపోర్టు కుటుంబ సభ్యులకు ఇవ్వాలి అని కళా వెంకట్రావ్ డిమాండ్ చేశారు. అలాగే, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్నారు. ములాకాత్ కు వెళ్లిన భువనేశ్వరీ, లోకేష్ చెప్పారు.. చంద్రబాబు అరెస్టయిన రోజు నుంచే వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. రోజులు పెరిగే కొద్దీ వైసీపీ వాళ్లే సమాధిని వారే త్రవ్వుకుంటున్నారు అంటూ కొల్లు రవీంద్ర మండిపడ్డారు.