NTV Telugu Site icon

Dwarampudi Chandrasekhar Reddy: పవన్ కల్యాణ్‌ ఎన్ని సమీక్షలు చేసినా ఓడిస్తా.. ద్వారంపూడి సవాల్‌

Dwarampudi

Dwarampudi

Dwarampudi Chandrasekhar Reddy: కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మార్పులు చేర్పులు చేస్తుండగా.. కాకినాడ అసెంబ్లీ సీటు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, మరోసారి పవన్‌ కల్యాణ్‌కు సవాల్‌ చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ నుంచి నాపై పోటీ చేయమని గతంలోనే పవన్ కి సవాలు చేశాను.. కనీసం గ్లాస్ గుర్తు అయినా నా మీద పోటీ పెట్టమని కోరుతున్నాను అన్నారు. ఇక, పవన్‌ కల్యాణ్‌ ఎన్ని రివ్యూలు చేసుకున్న ఓడిస్తానంటూ ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు. నా మీద గాజు గ్లాస్ పోటీ ఉంటుందని అనుకుంటున్నాను.. అలా లేకపోతే గతంలో పవన్ కల్యాణ్‌ చేసిన తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించారు. గత పర్యటనలో మూడు రోజులు ఉండి నేను చేసిన సవాల్‌కు స్పందించలేదన్నారు. మరోవైపు.. టికెట్ వచ్చినా.. రాకపోయినా జగన్ కోసమే పని చేస్తాను.. ఆ కుటుంబానికి ఎప్పుడు విధేయతతో ఉంటాం అన్నారు. ఇక, నా సీటును త్వరలోనే ప్రకటిస్తారు అని తెలిపారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి.

Read Also: YS Subba Reddy: కాంగ్రెస్‌ గూటికి వైఎస్‌ షర్మిల.. ఇలా స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

కాగా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాకినాడపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు.. ఈ మధ్యే కాకినాడలో పర్యటించిన ఆయన.. నాలుగు రోజుల పాటు వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించారు.. ముఖ్యంగా కాకినాడ సిటీ సీటుపై ఆయన దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.. అందులో భాగంగా.. వివిధ డివిజన్ల నేతలతో ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు పవన్‌ కల్యాణ్‌.. గతంలో.. సవాల్‌ చేసినట్టుగానే కాకినాడ నుంచి పోటీచేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నారనే చర్చ సాగుతుండగా.. మరోసారి హాట్‌ కామెంట్లు చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.