NTV Telugu Site icon

Kakinada Crime: వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన.. చంపేందుకు మహిళ బంధువులు ప్లాన్‌!

Kakinada Crime

Kakinada Crime

Kakinada Crime: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో తన కోరిక తీర్చాలని వివాహిత పట్ల వెంకటరమణ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంకటరమణ కృష్ణవరంగా గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. వివాహిత పట్ల వెంకటరమణ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సదరు మహిళ తన కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపి బాధపడింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న వివాహిత బంధువులు ఎలక్ట్రీషియన్ వెంకటరమణను పథకం ప్రకారం చంపేందుకు ప్లాన్ చేశారు. వెంకటరమణను చంపేందుకు వివాహిత బంధువులు సతీష్, రాజు,శివ ప్లాన్ చేసినట్లు తెలిసింది.

Read Also: Vijay Paul: ముగిసిన విజయ్‌పాల్ కస్టడీ.. ఇంకా దొరకని సమాధానాలు!

వారి ప్లాన్‌ ప్రకారం తమ పొలంలో మోటార్ పని చేయడం లేదని వెంకటరమణను సతీష్ పిలిచాడు. ఎలక్ట్రీషియన్‌ వెంకటరమణను తీసుకుని సతీష్ పొలం వద్దకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన వెంకటరమణపై ప్లాన్‌ ప్రకారం ముగ్గురు కలిసి దాడి చేశారు. వెంకటరమణ దాడి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. వివాహిత బంధువులు వెంకటరమణ బండిని దగ్ధం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments