జయశంకర్ భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఇంటి దొంగల బండారం భయపడుతోంది. ఇప్పటికే చోరీ కేసులో 13 మంది పైనా కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మరో 11 మంది పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు.. కేటీపీపీలో జరిగిన దొంగతనం ఇంటి దొంగల పనే అని పోలీసులు తేల్చడం సంచలనంగా మారింది. గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 1100వందల మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో మూడు నెలల క్రితం భారీ చోరీ జరిగింది. ప్రాజెక్ట్ స్టోర్ రూమ్ లో కోటి విలువచేసే మెటీరియల్ చోరీకి గురైనట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీనితో గత జూన్ 6న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేటీపీపీ డీఈ నుండి ఆర్టిజన్ వరకు 60మంది ఉద్యోగులను పలుమార్లు విచారించారు. కేటీపీపీకి సంబంధించిన కొన్ని పరికరాలు చెల్పూర్ లోని కళ్యాణి ఇంజనీరింగ్ వర్క్ షాప్ లో లభ్యం అయ్యాయి.
కేటీపీపీ జరిచిన దొంగతనం పైనా పోలీసు 4 సెక్షన్ లలో కేసునమోదు చేశారు. క్రైమ్ నెంబర్ :-152/2023 ఐపీసీ 120(B),379,409,420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. షాపు యజమానితోపాటు విక్రయించిన అధికారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. షాపు యజమాని ఫోన్ కాల్ డేటా ఆధారంగా మరో 11 మంది ఉద్యోగులపై కేసు అయ్యింది .Ktpp దొంగతనం కేసులో 7 మగ వాళ్లకు ఉండగా 6 మహిళల పైనా కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. మొత్తం 13 మంది పై కేసు కాగా అందులో 7 గురు మగ ఉద్యోగులు ఉండగా మరో 6.గురు మహిళ ఉద్యోగులు ఉన్నారు.
మరో వైపు సంబంధం లేని విషయంలో అధికారులపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్ కు తరలించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని కేటిపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. కేసుకు సంబంధించిన విచారణ పోలీసులతో కాకుండా జెన్కో విజిలెన్స్ అధికారులతో చేయించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. 3 రోజులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు అధికారులు సి.ఎల్ అని వేయడం చర్చనీయాంశంగా మారింది..