Site icon NTV Telugu

Kakarla Suresh: ముస్లిం సోదరులతో కలిసి జామియా మసీదులో కాకర్ల ప్రత్యేక ప్రార్థనలు..

Kakaral Suresh

Kakaral Suresh

నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని వైశ్య బజార్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసే జామియా మసీదులో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులతో కలిసి ఉదయగిరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇమామ్ సాబ్ కాకర్ల సురేష్ చేత ప్రార్థనలు జరిపించారు. అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా కాకర్ల సురేష్ ఉండాలని ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ముస్లిం సోదరులను పరిచయం చేసుకున్నారు. వారికి అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

Read Also: TDP-BJP-Janasena: టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై ఏమన్నారంటే..!

మాచర్ల శ్రీను కోరిక మేరకు ఇస్త్రీ షాపు వద్దకు వెళ్లి బట్టలను ఐరన్ చేశారు. టీడీపీ అధికారంలోనికి రాగానే రజకులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో ఇస్త్రీ పెట్టెను ఉచితంగా ఇచ్చారని దీని ద్వారా జీవనోపాధి పొందుతున్నట్లు శ్రీను తెలిపారు. అనంతరం సిద్ధార్థ నగర్ కు చెందిన టీడీపీ కార్యకర్త జ్యోతి పెంచలరావును పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. పాత బస్టాండ్ సెంటర్లో కాకర్ల అభిమానులు కరచాలనం చేశారు. అందరికీ అభివాదం తెలుపుతూ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, కాకర్ల వెంకట్, షేక్ ఖాజావలి హాజరత్ నాయుడు, ముస్లిం సోదరులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Read Also: Arun Goel: లోక్‌సభ ఎన్నికల ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా..

Exit mobile version