Site icon NTV Telugu

Kakarla Suresh: వింజమూరులో ఇంటింటికి కాకర్ల.. అడుగడుగునా జన నీరాజనాలు..!

Kakarla Suresh

Kakarla Suresh

Kakarla Suresh: వింజమూరులో గురువారం ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. స్థానిక గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా తరలివస్తూ ప్రతి దుకాణాన్ని ఇంటిని సందర్శించి సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రకటించిన ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తారని, రాష్ట్ర భవిష్యత్తును బంగారు మయం చేస్తారని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, మూడు సిలిండర్లు ఉచిత పంపిణీ, తదితర అంశాలతో కూడిన మేనిఫెస్టోను తప్పక అమలు చేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు రాగానే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మారుస్తారన్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే విధంగా చంద్రబాబు నిలబెడతారని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి సొంత నిధులతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ ప్రజలకు చేరువయ్యానని ఈ పథకాలను ఈ ట్రస్ట్ ద్వారా 25 సంవత్సరాల వరకు కొనసాగిస్తానని ఆయన తెలియజేశారు.

Read Also: AP Inter Results 2024: తొందరపాటు చర్యలొద్దు.. మే 24 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఇప్పటికే ట్రస్ట్ ద్వారా ఎంతో మంది యువతులకు కుట్టు శిక్షణ అందించి వారి జీవనోపాధికి బాటలు వేశామన్నారు. ఆరోగ్య రథం ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందించి గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడమని తెలిపారు. అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతోమంది పేదవారి ఆకలి తీర్చానని అన్నారు. సొంత నిధులతో సుమారు 16 పథకాలు మెట్ట ప్రాంత ప్రజలకు చేరువ చేశానని తెలిపారు. అధికారం ఉంటే మరెన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు సాధిస్తామని అన్నారు. కనుక ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ దంతులూరు వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, పాములపాటి మాల్యాద్రి మంచాల శ్రీనివాసులు నాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షులు గంగ పట్ల వెంగయ్య, వనిపెంట సుబ్బారెడ్డి, ఎంపీటీసీలు వనిపెంట హైమావతి, యాకసిరి భవాని, కాటం ప్రసన్న, బసిరెడ్డి సుమలత, పల్లా పురుషోత్తం, గణపం సుదర్శన్ రెడ్డి, భయపరెడ్డి కేశవులు రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు షేక్ సుభాని, కమతం శ్రీనివాసులు, ఇమ్రాన్, వెలుగోటి సురేష్, మున్నా, భరత్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు, ఉపాధ్యక్షులు పులిచెర్ల నారాయణరెడ్డి, మండల అధ్యక్షులు డేగ మధు యాదవ్, యువ మోర్చా అధ్యక్షులు మేకపాటి మాలాద్రి, గాలి రామ్మోహన్ నాయుడు, వేమూరు దొరస్వామి నాయుడు, నియోజకవర్గ కార్యదర్శి నూతలపాటి జయలక్ష్మి, కే శ్రీనివాసులు నాయుడు, దాట్ల కృష్ణారెడ్డి, నీలం పెరుమాళ్ళు, తిరుపతి ఆచారి, ఆరి కొండ శ్రీనివాసులు, అంబటి నాగేంద్ర, టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Read Also: AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడ క్లిక్‌ చేయండి..

గొట్టి గుండాలపాలెంలో వైసీపీకి భారీ షాక్
గొట్టి గుండాలపాలెంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కొండాపురం మండలం గొట్టి గుండాల పాలెం బూత్ నెంబర్ 185కి చెందిన సుమారు 20 కుటుంబాలు వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.కొండాపురం మండలం కన్వీనర్ మామిళ్ళపల్లి ఓంకారం సూచనల మేరకు క్లస్టర్ ఇన్చార్జి వెంకటాద్రి, జిల్లా అధికార ప్రతినిధి యారం కృష్ణయ్య నాయుడు, రైతు సంఘ అధ్యక్షులు పోలినేని రమేష్, యూనిట్ ఇంచార్జ్ రామ్మోహన్, బూత్ కన్వీనర్ వింజం చెన్నకేశవులు సారథ్యంలో టీడీపీ పార్టీలో చేరారు. కాకర్ల సురేష్ వారందరికీ తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో చేరిన వారు వీరే..
మోదేపల్లి కొండలరావు, మోదేపల్లి బాలకృష్ణ, మోదేపల్లి రమేష్, బండారు బసవయ్య, మోదేపల్లి సురేష్, మోదేపల్లి లక్ష్మయ్య, నల్లపునేని రమేష్, బండారు వెంకటరమణ, సాదినేని సుబ్బారావు, మోదేపల్లి కృష్ణవేణి, మోదేపల్లి వరమ్మ, బండారు సుబరత్తమ్మ, నల్లపునేని వెంకట నరసయ్య, మోదేపల్లి కేశవరతమ్మ, నల్లపు నేని రత్తమ్మ, మోదేపల్లి భాగ్యమ్మ, బండారు చెన్నమ్మ, తదితరులు ఉన్నారు.

Exit mobile version