Site icon NTV Telugu

Kakani Govardhan Reddy : బాబుది ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీద బురద చల్లాల తపననే : కాకాణి

New Project (48)

New Project (48)

Kakani Govardhan Reddy :టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏనాడూ రైతులను పట్టించుకోలేదన్నారు. వ్యవసాయాన్ని కించపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా, మంత్రి కాకాణి ఆదివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్లలో చంద్రబాబు వ్యవసాయానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? చంద్రబాబు ఏనాడూ రైతులను పట్టించుకోలేదన్నారు. విపత్తుల సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది. విపత్తు సమయంలో రైతులకు అన్నివిధాలా అండగా నిలిచాం. విపత్తుల సమయంలో చంద్రబాబు రైతులకు ఏం ఇచ్చారు? చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారు. రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీలు విషం చిమ్ముతున్నారు.

Read Also:Komatireddy: సచివాలంలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.. మంత్రిగా బాధ్యతలు స్వీకరణ

రాష్ట్రంలో తుపాన్లు, వరదల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేయగలిగాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. విద్యుత్ పరంగా భారీ నష్టం వాటిల్లినప్పటికీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టాం. గత రెండు రోజులుగా చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రభుత్వం ఎలా విఫలమైందో ఎక్కడా స్పష్టంగా చెప్పలేకపోయారు. గతంలో చంద్రబాబు రైతుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. ఎక్కువ పరిహారం ఇచ్చాం అని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తే చంద్రబాబుకు కడుపు మంట వస్తుంది.

Read Also:Congress: “ఆ ఎంపీ బిజినెస్‌లో మాకు సంబంధం లేదు”.. ఐటీ రైడ్స్‌కి దూరంగా కాంగ్రెస్..

ఫోటోలకు ఫోజులివ్వడం చంద్రబాబుకు అలవాటు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యే నాయకుడు. టీడీపీ హయాంలో రైతులు విత్తనాల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయారు. కందిపప్పుకు పెసరపప్పుకు తేడా తెలియని వ్యక్తి నారాలోకేష్. ఎవరి పాలనలో రైతులు లాభపడ్డారో బహిరంగ చర్చకు నేను సిద్ధమే. తేదీ, సమయం, స్థలం చెబితే వస్తాను. నా సవాల్ ను చంద్రబాబు స్వీకరించాలని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు.

Exit mobile version