నెల్లూరులోని జీజీహెచ్ ను మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సందర్శించారు. M.I.C.U వాటిలో పరిస్థితులను మంత్రికి వివరించారు అధికారులు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించామని తెలిపారు. వైద్య చికిత్సలో ఎలాంటి లోపం లేదని వెల్లడిందని, ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపం వల్ల ఆరు మంది చనిపోయారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని ఆయన మండిపడ్డారు.
Also Read : TamilNadu CM: మణిపూర్ క్రీడాకారులకు అండగా తమిళనాడు సర్కార్
ఈ వార్డులో 27 మంది చికిత్స పొందుతున్నారని, లిక్విడ్ ఆక్సిజన్ సమృద్ధిగా ఉంది… అదనంగా సిలిండర్లు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. మరణించిన వారిలో ఎవరూ వెంటి లేటర్ మీద లేరని, ఆసుపత్రి వైద్యులు..సిబ్బంది మీద కొందరు దుష్ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పధకం ప్రకారం ముఖ్యమంత్రి .. ప్రభుత్వం.. వ్యవస్థల మీద దాడి చేస్తున్నారని, ఇది దుర్మార్గం… మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
అలాగే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని తాము ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామని కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉచితంగా పంటల బీమా , పట్టాల పంపిణీ , ఇన్ పుట్ సబ్సిడీ విధానం ద్వారా రైతులకు అండగా ఉంటున్నామని ఆయన స్పష్టం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు.
