Site icon NTV Telugu

Kakani govardhan Reddy : చంద్రబాబు జీవితం చీకటిమయమైంది

Kakani On Lokesh Yatra

Kakani On Lokesh Yatra

రాష్ట్రంలో 42 స్కిల్ డెవలప్‌ మెంట్ కేంద్రాల కోసం రూ.3వేల 700 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మాట్లాడుతూ.. ఈ నిధులు కేంద్రాలకు ఇచ్చారా అని, ఈ నిధులలోనే అవినీతికి పాల్పడ్డారన్నారు. అవినీతి గురించి మాట్లాడకుండా అరెస్టు అక్రమమని టిడిపి నేతలు చెబుతున్నారని, చంద్రబాబు అవినీతికి పాల్పడటం లేదని కోర్టు లకు చెప్పడం లేదు…. సెక్షన్ ల గురించే చెబుతున్నారన్నారు. టీడీపీ కార్యక్రమాలకు ప్రజలు రావడం లేదని, ప్రజల్లో చంద్రబాబుకు ఎంత పరపతి ఉందొ దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందన్నారు కాకాణి.

అంతేకాకుండా.. ‘స్కిల్ కేసులో అవినీతి జరిగిందని ఇప్పటికే ఆదాయపన్ను శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లు నిర్దారించాయి. కానీ ఎల్లో మీడియా మాత్రం తప్పును కప్పిపుచ్చుకునేందుకు తంతాలు పడుతోంది. ఒక వైపు చంద్ర బాబు కు మద్దతుగా రాయడం…మరో వైపు ఏదో ఒక శాఖ పై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. రైతు భరోసా కేంద్రాలపై ఈరోజు రాశారు. ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన చంద్రబాబుకి ఎందుకు రాలేదు. 2014 ఎన్నికల్లో రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. అప్పుడు. పచ్చ మీడియా కు రైతులు ఎందుకు గుర్తుకు రాలేదు. చంద్రబాబు జీవితం చీకటిమయమైంది.

చంద్రబాబు అరెస్ట్ అవుతానే.. లోకేష్ ఢిల్లీలో కూర్చొని వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అవినీతిని ఇంటింటికి తెలియజేయమని లోకేషే చెప్పాడు. మంత్రి స్థాయిలో ఉన్న రోజాపై బండారు సత్యనారాయణమూర్తి ద్వారా మాట్లాడించడం పద్ధతి కాదు. అందుకే రోజాకు అందరూ మద్దతు తెలుపుతున్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తిపై స్థాయి దాటి మాట్లాడటం పై ఎవరు హక్కు ఇచ్చారు. గతంలో ఎప్పుడూ. ఎవరూ ఇలా విమర్శలు చేయలేదు. మహిళా అని చూడకుండా చేసిన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకుంటోంది. రైతు భరోసా కేంద్రాలకు ప్రధానమంత్రి పేరు కూడా పెట్టాం. మీలాగా కేంద్ర పథకాలకు మీరు స్టిక్కర్ తగిలించుకున్నట్టుగా మేము చేయలేదు. కాంతితో క్రాంతి అని కార్యక్రమం చేశారు. ఆధారంగా వెళుతున్న ఆర్పి చీకటిగా చేసి.. చిరు జ్యోతిని వెలిగించారు.’ అని కాకాణి గోవర్థన్‌ రెడ్డి.

Exit mobile version