నెల్లూరు జిల్లాలో ఆగస్టు 9 నుంచి 30 వరకు ‘నాభూమి-నాదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవస్ధన్‌రెడ్డి సోమవారం తెలిపారు. కలెక్టర్ ఎం. హరినారాయణన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 20 రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో ప్రధాని, ముఖ్యమంత్రి సందేశాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, పోలీసులు, సైనికుల పేర్లతో కూడిన శిలా ఫలకాలను ఏర్పాటు చేయనున్నారు.
Also Read : Bhola Shankar: ‘భోళా శంకర్’ పవన్ రిజెక్ట్ చేసిన సినిమానే.. మరి చిరు ఎందుకు చేశాడో తెలుసా?
స్వాతంత్య్ర సమర సమయంలో స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను, దేశ సమగ్రతను కాపాడేందుకు సైనికుల త్యాగాలను స్మరించుకోవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఇతివృత్తమని అన్నారు. జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. 20 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మీడియా మద్దతు కూడా కోరారు.
Also Read : Telangana: వైన్ షాపుల టెండర్లకు భారీ స్పందన.. మూడు రోజుల్లోనే 2000 దరఖాస్తులు..!
ఇదిలా ఉంటే.. నిన్న నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 11 రకాల సర్టిఫికెట్లను ప్రజలకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. చంద్రబాబు సభలకు ప్రజలు రావడం లేదని.. అందుకే మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇస్తామని చెబుతున్నాడు.. ఇది సాధ్యమయ్యేదేనా అంటూ ఎద్దేవా చేశారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. జిల్లాలో నెల్లూరు, సంగం బ్యారేజీల పనులు పూర్తి చేసి ప్రారంభించామన్నారు. సోమశిల.. కండలేరులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచామని మంత్రి తెలిపారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి వరద నీటిని పంపే కాలువ సామర్థ్యాన్ని కూడా పెంచిన ఘనత తమదేనని ఆయన వెల్లడించారు. కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.