NTV Telugu Site icon

Kajal Aggarwal : కాజల్ బర్త్ డే.. ఫ్యాన్స్ చేసిన ఆ పనికి ఎమోషనల్ అయిన కాజల్..

Kajal (1)

Kajal (1)

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..ఈ భామ తెలుగు ,తమిళ్ ,హిందీ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.టాలీవుడ్ కాజల్ కెరీర్ దూసుకుపోతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూనీ పెళ్లి చేసుకొని ఫామిలీ లైఫ్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామ గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన “భగవంత్ కేసరి” సినిమాలో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.అయితే పెళ్ళికి ముందు గ్లామర్ పాత్రలతో అలరించిన కాజల్ ఇప్పుడు పెర్ఫార్మన్స్ రోల్స్ చేయాలనీ భావిస్తుంది.

Read Also :Kalki 2898 AD : నేడే ప్రభాస్ కల్కి సెకండ్ ట్రైలర్ రిలీజ్..

దానిలో భాగంగా ఈ భామ రీసెంట్ గా సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించింది.ఈ సినిమాలో కాజల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.రీసెంట్ గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చిన కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం కాజల్ ఇండియన్ 3 ,కన్నప్ప వంటి భారీ సినిమాల్లో నటిస్తుంది.ఆ సినిమాల్లో కాజల్ దీ కేవలం అతిధి పాత్రే అని తెలుస్తుంది.ఇదిలా ఉంటే జూన్ 19 కాజల్ బర్త్డే సందర్భంగా ఆమె అభిమానులు మంచి పనులు చేసారు.తమ అభిమాన హీరోయిన్ బర్త్ డే సందర్భంగా సుమారు 150 మంది పేద పిల్లలకు భోజనాలు పంపిణి చేసారు.అలాగే 50 మొక్కలను కూడా నాటారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన కాజల్ ఎంతో ఎమోషనల్ అయింది.నాపై మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఎప్పటికి మర్చిపోలేను మీ అందరికి ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది.

Show comments