Satyabhama : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిపోయింది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో పరిచయం అయినా చందమామ సినిమాతో తొలి హిట్ అందుకుని.. తెలుగు కుర్రాళ్ల మనసు దోచింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని మగబిడ్డకు జన్మనిచ్చింది.
Read Also:High Court: కేసీఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్..
పెళ్లి తర్వాత మెయిన్ లీడ్ లో తన కెరీర్ బెంచ్ మార్క్ సినిమా 60వ సినిమా దర్శకుడు సుమన్ చిక్కాల కాంబినేషన్లో చేసిన లేటెస్ట్ సినిమానే సత్యభామ. క్రైమ్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ మూవీలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందినప్పటికీ, జనాలకు ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేదు. మిక్స్ డ్ టాక్ తో అంతంత మాత్రాన థియేటర్లలో ఆడింది.
Read Also:Team India: బార్బడోస్లో అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు.. (వీడియో)
కానీ ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమా అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూద్దాం అనుకునేవారు అయితే ప్రైమ్ వీడియోలో చూసేయొచ్చు. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా శశి కిరణ్ తిక్క, బాబీ తిక్క నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.