NTV Telugu Site icon

Bhagavanth Kesari: హనుమకొండలో బతుకమ్మ ఆడిన కాజల్‌ అగర్వాల్, శ్రీలీల.. వీడియో వైరల్‌!

Kajal Aggarwal And Sreeleela

Kajal Aggarwal And Sreeleela

Kajal Aggarwal and Sreeleela played Bathukamma at Hanamkonda: తెలంగాణలో ‘బతుకమ్మ’ పండగ ఈ నెల 15న (మహాలయ అమావాస్య) ఆరంభం కానుంది. ఆడపడుచులంతా కలిసి చేసుకునే పూల పండగ బతుకమ్మ.. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు సందడిగా కొనసాగుతుంది. అయితే బతుకమ్మ సందడి ఈసారి ముందే ప్రారంభమైంది. ఆదివారం హనుమకొండలో హీరోయిన్స్ కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల బతుకమ్మ ఆడారు. భగవంత్‌ కేసరి ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో భాగంగా ఈ ఇద్దరు బతుకమ్మ ఆడిపాడారు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తెరకెక్కిన సినిమా ‘భగవంత్‌ కేసరి’. యువ హీరోయిన్ శ్రీలీల ముఖ్యభూమిక పోషించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ప్రతినాయకుడిగా నటించారు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భగవంత్‌ కేసరి ట్రైలర్‌ విడుదల కార్యక్రమం గత రాత్రి హనుమకొండలో జరిగింది.

Also Read: Yatra 2: ‘యాత్ర 2’ నుంచి ఫస్ట్ లుక్ విడుదల.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..!

భగవంత్‌ కేసరి ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో హీరోయిన్స్ కాజల్‌ అగర్వాల్, శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. ఇద్దరు తెలుగు అమ్మాయిలా మెరిసిపోయారు. ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సందర్భంగా శ్రీలీల, కాజల్‌ బతుకమ్మ ఎత్తుకుని స్టేజ్‌పై వెళ్లారు. అక్కడ పెట్టి బతుకమ్మ ఆడిపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Show comments