Site icon NTV Telugu

Kadiyam Srihari : కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరు

Kadiyam Srihari

Kadiyam Srihari

కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరని హనుమకొండ జిల్లా స్టేషన్ ఘన్‌ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలో పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. పార్లమెంటు ఎన్నిక వేళ …..అదే మోసం పునరావృతం చేయబోతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4 లక్షల 50 వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పారన్నారు. ఇందిరమ్మ ఇళ్లకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని,
గ్యాస్ సిలిండర్ లు కూడా అనేక నిబంధనలతో …..అర్హులను తగ్గించిందన్నారు. గృహ జ్యోతిలో 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని …..అక్కడ కూడా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ….ఉద్యోగ నియామకాలకు …..పరీక్షలు నిర్వహించిందన్నారు. ఎన్నికల నియావళి అమల్లోకి రావడంతో నియామక పత్రాలు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలిచ్చమని నిస్సిగ్గుగా చెప్పుకుంటుందన్నారు.

అంతేకాకుండా..’కాంగ్రెస్ సర్కార్ రైతులను నట్టేట ముంచుతుంది. ఇప్పటికి కూడా రైతుబందు అందరికీ రాలేదు. 2 లక్షల రుణమాఫీపైన కూడా స్పష్టత ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి భారాస ను భూచిగా చూపించి. ఆ మంత్రులను హెచ్చరిక చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలి. ప్రజల దృష్టిని మరల్చాడానికి ప్రయత్నం చేస్తోంది. వేసవి కాలంలో వచ్చే సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు కడియం శ్రీహరి.

ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రైతులకు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతన్న ను ఆదుకోవడంలో మంత్రులు అధికారులు ఎవరు అందుబాటులో లేరని, సాగునీరు, తాగు నీరు కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఓడిన గెలిచిన ప్రజల పక్షాన ఉంటామని, గత పది ఏళ్లలో రైతులు ఆనందం చూసారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు ఉన్న భూములను మెంట గా మార్చుతున్నారని, ఒక్కపుడు భారతదేశానికి అన్నం పెట్టిన తెలంగాణ రాష్టం ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు గంగుల కమలాకర్‌. రైతు భరోసా,రుణమాఫీ ఇప్పటి వరకు రైతులకు అందలేదని, బి ఆర్ ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రజలకు పది సంవత్సరాల తేడా కనిపిస్తోందని, కేసీఆర్ విలువ ఇప్పుడు ప్రజలకు తెలుస్తోందన్నారు.

Exit mobile version