హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం ఈ తీర్పు పై పూర్తి అధ్యయనం చేయాల్సి ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పే తుది తీర్పు కాదు దీన్ని తుది తీర్పుగా భావించి ఉప ఎన్నికలు వస్తాయని కొన్ని పార్టీలు పండుగ చేసుకుంటున్నాయని, కానీ వారికి ఇంకా పైనా చాలా కోర్టులు ఉన్నాయన్న విషయం ఆ పార్టీ వాళ్లు విస్మరిస్తున్నారన్నారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై డబుల్ బెంచ్‌కి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకెళ్లొచ్చు ఇలా చాలా అంశాలుంటాయని ఆయన వ్యాఖ్యానించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఫిరాయింపులపై కామెంట్ చేసే నైతిక అర్హత లేదని ఆయన విమర్శించారు.
Mpox Cases: భారత్లో మంకీపాక్స్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు..!
పదేళ్లలో చాలా పార్టీలను విలీనం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. పార్టీ ఫిరాయింపులపై కామెంట్ చేయడం హాస్యస్పదంగా ఉందని ఆయన అన్నారు. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ పెద్దలకు కోపం ఉందని, కడియం శ్రీహరి ఓడిపోవాలని చాలామంది బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కానీ ప్రజల ఆశీర్వాదంతో కడియం శ్రీహరి కడియం కావ్య గెలుపొందారని ఆయన తెలిపారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని, హైకోర్టు ఇచ్చిన తీర్పులే తుది తీర్పుగా వాళ్ళు ఊహించుకుంటున్నట్టున్నారన్నారు. సుప్రీంకోర్టు ఉంది ఆపై స్పీకర్ ఉన్నారు చాలా ప్రాసెస్ నడవాల్సి ఉందన్నారు. పార్టీ ఫిరాయికులపై కోర్టుల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి భిన్న తీర్పునిచ్చాయన్నారు. ఈ భిన్న తీర్పుల నేపథ్యంలో సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపైన స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పుడే అది రాజ్యాంగబద్ధంగా అమలవుతుందని కడియం శ్రీహరి అన్నారు.
