NTV Telugu Site icon

Kadapa: పోలీసుల పనితీరు భేష్.. జమ్మలమడుగులో పరిస్థితులను సమీక్షించిన ఎస్పీ

Kadapa Sp

Kadapa Sp

Kadapa: కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితులను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సమీక్షించారు. ఎన్నికల రోజు పోలీసుల పనితీరు భేష్ అంటూ ఆయన ప్రశంసించారు. జమ్మలమడుగులో ఎన్నికల రోజు తలెత్తిన వివాదాలను పోలీసులు చాకచక్యంగా అణిచివేశారని.. పోలీసులు ప్రాణాలకు తెగించి చాలెంజింగ్‌గా పరిస్థితులను అదుపు చేశారని చెప్పుకొచ్చారు. ఎన్నికల రోజు ఘర్షణలను సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

Read Also: AP Violence: బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

కౌంటింగ్ తర్వాత కూడా జమ్మలమడుగులో కొన్ని ఘటనలు చోటు చేసుకుంటాయి అన్న సమాచారం ఉందన్నారు. వాటిపై కూడా ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ చెప్పారు. కౌంటింగ్ రోజు అవసరమైతే రాజకీయ నాయకులను ప్రజలను గృహనిర్బంధం చేయడానికి వెనకాడమని ఆయన హెచ్చరించారు. జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధమని.. ఎన్నికల కౌంటింగ్ రోజు జమ్మలమడుగులో కర్ఫ్యూ విధించడానికి కూడా వెనకాడమని పేర్కొన్నారు. ఎన్నికల నియమాలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ హెచ్చరించారు.