Site icon NTV Telugu

Kadapa SP: కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు

Kadapa Sp

Kadapa Sp

Kadapa SP: జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు. నగర శివార్ల నుంచి బస్సులు, ఇతర వాహనాల దారి మల్లింపులు ఉంటాయన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలో కౌంటింగ్ ఏజెంట్లకు, కౌంటింగ్ సిబ్బందికి వేర్వేరుగా వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశామని ఎస్పీ చెప్పారు. నగరంలో 144 సి.ఆర్.పి.సి సెక్షన్ క్రింద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఉదయం 7 గంటల తర్వాత వచ్చే ఏజెంట్స్‌ను ఎవరినైనా సరే అనుమతించే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ స్పష్టం చేశారు.

Read Also: Chandrababu: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై చంద్రబాబు ట్వీట్

Exit mobile version