కడప టీడీపీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, ఆమె భర్త శ్రీనివాసుల రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు బహిరంగంగా నిరసనలకు దిగాయి. సీనియర్ నాయకుడు కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమావేశం అయ్యారు. అనంతరం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవికి మంచి బుద్ది ప్రసాదించాలని ఆదేవుడిని కోరారు.
Also Read: Abhishek Sharma: దానికోసమే వెయిటింగ్.. అభిషేక్ సోదరి కీలక వ్యాఖ్యలు!
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మొదటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ జెండా మోసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు, నాయకులు మండిపడ్డారు. ఇటీవల టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తూ సీనియర్లను ఎమ్మెల్యే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారమై కమలాపురం సీనియర్ నాయకుడు పుత్తా నరసింహా రెడ్డిని అసంతృప్తి నేతలు కలిశారు. టీడీపీ కోసం ముందునుంచి పనిచేసిన తమని గుర్తించి ఆదుకోవాలని కోరారు. తప్పకుండా న్యాయం చేస్తానని నరసింహా రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి కడప టీడీపీలో అసమ్మతి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
