Site icon NTV Telugu

BRS Joinings: బీఆర్‌ఎస్‌లో చేరిన కాచిగూడ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ ప్రతిభ

Kachiguda Bjp Mahila Morcha President Pratibha

Kachiguda Bjp Mahila Morcha President Pratibha

BJP Leader Pratibha Joins BRS: కాచిగూడ బీజేపీ మహిళా ప్రెసిడెంట్‌ ఎం.ప్రతిభ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. అంబర్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువాను కప్పి ఆమెను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ గోల్నాక క్యాంపు కార్యాలయంలో కాలేరు వెంకటేష్ సమక్షంలో కాచిగూడ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఎం. ప్రతిభ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Also Read: Vinod Kumar: కేసీఆర్ గురించి మోడీ ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు?

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేరిన వారందరికీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రజలకు జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి అలాగే ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రజా సేవకు ఆకర్షితులమై బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఎం. ప్రతిభ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Exit mobile version