Site icon NTV Telugu

Pardeep Narwal: కబడ్డీ లెజెండ్ ప‌ర్ధీప్ న‌ర్వాల్‌ సంచ‌లన నిర్ణ‌యం!

Pardeep Narwal Retirement

Pardeep Narwal Retirement

కబడ్డీ లెజెండ్ పర్దీప్ నర్వాల్ సంచ‌లన నిర్ణ‌యం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ క‌బ‌డ్డీకి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో 28 ఏళ్ల ప‌ర్దీప్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. తాజాగా స్పోర్ట్స్ బ్రాడ్‌క్టాస్ట‌ర్ సునీల్ తనేజాతో జరిగిన లైవ్ ఇంటార‌క్ష‌న్‌లో హ‌ర్యానా ఆటగాడు పర్దీప్ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్ల‌డించాడు. విషయం తెలిసిన ఆయన ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక తాను కోచ్ అవుతానని తనేజాతో ప‌ర్ధీప్ చెప్పాడు.

ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు ప్రదీప్ నర్వాల్ అన్న విషయం తెలిసిందే. రైడింగ్‌కు వెళ్లాడంటే తప్పకుండ పాయింట్ రావాల్సిందే. ఒక్కోసారి 2-3 పాయింట్స్ కూడా తెచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పీకేఎల్ చరిత్రలో 1801 రైడ్ పాయింట్లు సాధించాడు. అతని సగటు ఓ మ్యాచ్‌కు 9.47 రైడ్ పాయింట్లుగా ఉంది. ఇంతటి గొప్ప ఆటగాడిని పీకేఎల్ 12 వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. రెండు రోజులు జరిగిన వేలంలో యూపీ యోధాస్, పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ వంటి మాజీ జట్లు కూడా అతడిపై ఆసక్తి చూపలేదు. లీగ్ చరిత్రలో గొప్ప రైడర్లలో ఒకడిగా ఉన్న పర్దీప్‌ను మారె ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

Also Read: Deepika Padukone: ‘స్పిరిట్’ కోసం తగ్గని దీపిక.. అల్లు అర్జున్ కోసం ఎందుకు తగ్గింది?

గ‌త నాలుగు సీజ‌న్ల‌లో ప‌ర్ధీప్ నర్వాల్ ఫామ్‌ను కోల్పోయాడు. యూపీ యోధాస్, బెంగళూరు బుల్స్ త‌ర‌పున పెద్ద‌గా ప్రభావం చూపలేకపోయాడు. దాంతో అతడిని కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. వేలంలో అమ్ముడుపోకపోవడంతో నిరాశ చెందిన ప‌ర్ధీప్.. ప్రొఫెషనల్ క‌బ‌డ్డీకి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. పాట్నా పైరేట్స్ మూడుసార్లు టైటిల్‌ గెలుచుకోవడంలో ప‌ర్ధీప్ ముఖ్యపాత్ర పోషించాడు. లీగ్ హిస్ట‌రీలో అత్య‌ధిక రైడ్ పాయింట్లు సాధించిన రికార్డు అతడి పేరిట ఉంది. భార‌త జాతీయ క‌బ‌డ్డీ జ‌ట్టుకు ప‌ర్ధీప్ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

Exit mobile version