Deepika Padukone: ‘స్పిరిట్’ కోసం తగ్గని దీపిక.. అల్లు అర్జున్ కోసం ఎందుకు తగ్గింది?
- స్పిరిట్ కోసం తగ్గని దీపిక పదుకొనే
- స్పిరిట్ కోసం దీపిక ప్లేస్‌లో త్రిప్తి డిమ్రి
- బన్నీ-అట్లీ సినిమాలో దీపిక పదుకొనే ఫైనల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పిరిట్ కోసం తగ్గని దీపిక పదుకొనే.. అల్లు అర్జున్, అట్లీ సినిమా కోసం తగ్గిందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ముందుగా స్పిరిట్ సినిమాలో దీపికను తీసుకోవాలని అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. కానీ అమ్మడు పెట్టిన కండీషన్స్ ఆయనకు నచ్చలేదు. 20 కోట్ల పారితోషికం, రోజుకి ఇన్ని గంటలే షూటింగ్‌లో పాల్గొంటానని చెప్పిందట. దీంతో ఆమె ప్లేస్‌లో త్రిప్తి డిమ్రిని తీసుకున్నాడు. కానీ దీపిక వర్సెస్ సందీప్ వార్ మాత్రం గట్టిగానే నడిచింది. ముఖ్యంగా దీపిక కథ లీక్ చేసిందంటూ.. సందీప్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీనిపై ఆమె కూడా తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించింది.
అయితే ఇప్పుడు బన్నీ-అట్లీ సినిమాలో దీపిక పదుకొనే ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. కానీ రెమ్యునరేషన్ మాత్రం స్పిరిట్ అంత ఇవ్వడంలేదని సమాచారం. స్పిరిట్ నుంచి ఆమె తప్పుకోవడానికి 20 కోట్ల రెమ్యునరేషన్, 15% షేర్ డిమాండ్ చేయడమే కారణమని చర్చలు జరిగాయి. కానీ బన్నీ సినిమా కోసం ఎలాంటి షేర్ లేకుండా.. ‘కల్కి 2898 AD’ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్‌నే తీసుకుంటోందట. బన్నీ సినిమా కోసం 15 కోట్లకు అటు ఇటుగా దీపిక పారితోషికం ఉంటుందని సమాచారం.
Also Read
Also Read: HHVM Pre Release Event: ఫాన్స్ గెట్ రెడీ అమ్మ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్?
అయితే రెమ్యునరేషన్ విషయంలో దీపిక పదుకొనే ఎందుకు తగ్గిందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అందులోనూ బన్నీతో ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారనే టాక్ ఉంది. అయినా కూడా ఈ సినిమాను దీపిక కావాలనే ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయట. అమ్మడు పెట్టిన కండీషన్స్‌కు మేకర్స్ ఓకె చెప్పడంతో పాటు తక్కువ డేట్స్ ఇచ్చి ఇచ్చారని అంటున్నారు. ఏదేమైనా దీపిక ఈ మధ్య ఏదో ఓ విధంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!