Kabaddi Player: సరదాగా ఆడిన ఆట ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. విజయనగరంలో జిల్లాలోని పూసపాటిరేగ మండలం ఎరుకొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్త సంవత్సరం సందర్భంగా 4 గ్రామాల మధ్య కబడ్డీ పోటీలు జరిగాయి. కూతకు వచ్చిన రమణ అనే యువకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు ఆటగాళ్లు. వెనుక ఉన్న క్రీడాకారులంతా రమణపై పడ్డారు. దీంతో రమణ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే యువకుడిని కేజీహెచ్ తరలించారు.
GVL Narasimha Rao: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీ జీవీఎల్ బహిరంగ లేఖ
చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కబడ్డీ ఆడుతూ రమణ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నెలకొంది. కూతకొచ్చిన రమణపై ప్రత్యర్థి జట్టు ఒక్కసారిగా మీద పడడంతో రమణ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రమణ ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
