KA Trailer: ‘క’ ట్రైలర్ విడుదల.. అంచనాలు పెంచేలా, ఆసక్తిరంగా..!
- కిరణ్ అబ్బవరం తాజా చిత్రం క
- అక్టోబర్ 31న క సినిమా విడుదల
- క ట్రైలర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘క’. సుజీత్, సందీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో రూపుదిద్దుకుంది. నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న క సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
2 నిమిషాల 45 సెకండ్ల నిడివి గల క ట్రైలర్.. యాక్షన్ సన్నివేశంతో మొదలవుతుంది. చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిలో పోస్ట్ మ్యాన్‌గా పనిచేస్తుంటాడు అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఆ ఊరు భౌగోళికంగా ఎంతో ప్రత్యేకం. అక్కడ సత్యభామ అనే అందమైన అమ్మాయితో అతడు ప్రేమలో పడతాడు. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ.. ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ను బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది?, వాసుదేవ్‌ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు? అనే అంశాలు ఆసక్తిని కలిగించాయి.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Also Read: IND vs NZ 2nd Test: నాలుగో ఇన్నింగ్స్ ఆడలేం.. 200 ప్లస్ లీడ్ ఉంటేనే గెలుపై అవకాశాలు!
ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో క ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కిరణ్ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు అలరించాయి. కిరణ్ అబ్బవరం నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ బాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!