Site icon NTV Telugu

KA Paul: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేనే కారణం..

Ka Paul

Ka Paul

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తానే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేఏ పాల్ శుభాకాంక్షలు తెలిపారు. తాను చెప్పినట్టే కాంగ్రెస్ గెలిచిందని.. 65 సీట్లు వస్తాయని చెప్పానని, అలానే వచ్చాయన్నారు కేఏ పాల్.

Read Also: CM YS Jagan: మీరు ధైర్యంగా ఉండండి.. ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్‌కి తెలంగాణలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు పవన్‌ను తరిమి తరిమి కొట్టారని చెప్పుకొచ్చారు. కేఏ పాల్ మాట్లాడుతూ.. “విశాఖపట్నం వచ్చి మాట్లాడుతున్నావ్… ఇక్కడ నుండి కూడా నువ్వు పో.. నువ్వు ప్యాకేజీ స్టార్‌వి.. పవన్ నువ్వు అవినీతి పార్టీ టీడీపీతో వున్నావ్, తెలుసుకో. జాబు రావాలంటే బాబు రావాలి అన్నావు… నువ్వు వచ్చాక జాబ్‌లు ఎక్కడ ఇచ్చావు.చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్‌లో కలిపేశారు…పవన్ ఏమో జనసేన పార్టీని బీజేపీలో కలిపేయడానికి చూస్తున్నారు.” అని పాల్‌ వ్యాఖ్యానించారు.

దమ్ముంటే అవకాశమివ్వాలని.. ఆంధ్రప్రదేశ్‌లో 175కు 175 స్థానాలు గెలుస్తామని కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దివంగత నేత ఎర్రన్నాయుడిని చూసి నేర్చుకోవాలన్నారు. జైలుకు వెళ్లాలంటే టీడీపీ పార్టీలో ఉండాలన్నారు. సీమాంధ్రను సింగపూర్‌ చేస్తానన్న చంద్రబాబు.. చీమలాంధ్ర చేశాడని, అంతా సర్వనాశనం చేశాడని తీవ్రంగా మండిపడ్డారు.

 

Exit mobile version