KA Paul: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిరంజీవి లాగే పవన్ కల్యాణ్ తన పార్టీని అమ్ముకుంటున్నాడు.. తమ్ముడు కల్యాణ్ ఎంపీగా పోటీ చేసి వేల కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు అంటూ ఆరోపించారు. ఇక, పవన్ తనకు ఒక్క సీటు ఇచ్చినా చాలనుకుంటాడు.. నాదెండ్ల మనోహర్‌కు సీటు లేదన్నా ఒకే అంటారంటూ సెటైర్లు వేశారు. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయమని హరిరామజోగయ్య చెప్పారు.. కానీ, పవన్ ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోతున్నారని విమర్శించారు.
Read Also: The Family Star: మిడిల్ క్లాస్ అన్నావ్ కదా అన్నా.. అంబానీ రేంజ్ లో పెళ్లి చేసుకుంటున్నావ్
మరోవైపు.. పవన్ కల్యాణ్ ముసలోడు అయిపోయాడు.. ఇక సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్ చేశారు కేఏ పాల్.. ఇక, ఎన్నికలను ఏప్రిల్ లో నిర్వహించి మేలో ఫలితాలిస్తున్నారు.. దాని వలన ఈవీఎంలు మిస్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎలక్షన్ ను నిర్వహించవద్దని ఎన్నికల అధికారిని కలిశాను.. ఏపీకి ముగ్గురు ఎన్నికల కమిషనర్లను నియమించాలని కోరానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ నుంచి బాబూ మోహన్, విశాఖ నుంచి కేఏ పాల్ ఎంపీలుగా పోటీ చేస్తున్నాం.. ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వైఎస్ షర్మిల తన ప్రాపర్టీల కోసమే అన్నతో గొడవపడుతుంది.. తెలంగాణాలో కాంగ్రెస్ ను తిట్టి మరలా 500 కోట్లకు కాంగ్రెస్ లోనే తన పార్టీని విలీనం చేశారని ఆరోపించారు.. ఇదే చివరి ఎలక్షన్.. మళ్లీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే చట్టాలన్నీ మారిపోతాయి.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.