KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. వచ్చేది పాల్ ప్రభుత్వమే… అధికారంలోకి రాగానే విశాఖను ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని సీఎం జగన్ లేఖ రాస్తే మోడీ ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మటానికి మోడీ ఎవరు, చంద్రబాబు ఎవరు అంటూ ప్రశ్నలు గుప్పించారు. మోడీ, జగన్ మన పరిశ్రమలను అదానికీ అమ్మేస్తున్నారని, ఎందుకంటే అదానీ మోడీకి మంచి స్నేహితుడని కేఏ పాల్ ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ అమ్మటానికి వీలులేదని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తేల్చి చెప్పారు. స్టీల్ ప్లాంట్‌పై కోర్టులో తాను వాదిస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు.
Read Also: Kishan Reddy: మోడీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు..