NTV Telugu Site icon

KA Paul: చిరంజీవి కూడా జనసేనలో చేరుతానని లీక్స్ ఇస్తున్నాడు..

Ka Poul

Ka Poul

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరతారని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. చిరంజీవి, పవన్ ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పారు. బీజేపీకి ఎందుకు జనసేన పార్టీ పొత్తు.. ఇన్ కం టాక్స్ ఎగ్గొట్టడానికే బీజేపీ పొత్తు అని ఆయన వ్యాఖ్యనించారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్ లకు గుండు గీస్తానిని పాల్ అన్నారు. బీజేపీ-బి పార్టీలను ఓడిస్తానని తెలిపారు.

Read Also: Rajinikanth: భారతీయుడు+విక్రమ్ = జైలర్…

చిరంజీవి, పవన్ కళ్యాణలను ప్రజలు నమ్మకండి అని కేఏ పాల్ అన్నారు. పవన్ కళ్యాణ్ ది వారహి యాత్ర కాదు మోడీ యాత్ర అని ఆయన విమర్శించారు. చిరంజీవి కూడా జనసేనలో చేరుతానని లీక్స్ ఇస్తున్నాడు అని కేఏ పాల్ తెలిపారు. సిగ్గు ఉన్న వారు ఏవరైన జనసేనలో చేరతారా అంటూ పాల్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నేటి నుంచి విశాఖలో చేస్తుంది వారాహి యాత్ర కాదు.. అది కేవలం బీజేపీ కోసమేనని ఆయన ఆరోపించారు. దీనిపై చిరంజీవి, పవన్, నాగేంద్రబాబుతో ఓపెన్ డిబేట్ కు నేను సిద్ధంగా ఉన్నాను అని కేఏ పాల్ సవాల్ విసిరారు.

Read Also: Nama Nageswara Rao: దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలి

ఉండవల్లి అరుణ్ కుమార్, జెడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్, జయ ప్రకాష్ నారాయణ లాంటి మేధావులు కేవలం యాంకర్లుగా మిగిలిపోవద్దు కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. 2024 తరువాత జనసేన బీజేపీలో విలీనం కావడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ చీఫ్ జోస్యం చెప్పారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి 5000 కోట్ల రూపాయలను తీసుకున్నారని ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్లు కోసం రూ.1500 కోట్లు కలెక్ట్ చేశారని.. చిరంజీవి లాంటోళ్లు కేవలం ఐటి రైడ్స్,
ఈడీ రైడ్స్ కు భయపడటం వల్లే.. బీజేపీకి సరెండరపుతున్నారని కేఏ పాల్ విమర్శించారు.