తెలంగాణ అభివృద్ది చేసి అప్పులు తీర్చి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు.. ప్రతి నియోజకవర్గంలో ఉచిత విద్యా-వైద్యం ఆస్పత్రులు కట్టి అభివృద్ది చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థులకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. కేవలం 40 లక్షల రూపాయల మాత్రమే ఖర్చు చేయమని ఎన్నికల కమిషన్ తెలిపింది అని ఆయన అన్నారు. ప్రొఫెసర్స్, డాక్టర్లు, ఇంజనీర్స్, లీడర్స్ ఎమ్మెల్యే అభ్యర్థలందరు ఏకం కండి.. కేవలం ఎమ్మెల్యేగా 40 లక్షల రూపాయలు ఖర్చు చేయండి.. మనం గెలుస్తాం అని కేఏ పాల్ వ్యాఖ్యనించారు.
Read Also: Harish Rao: కాంగ్రెస్ పార్టీ BRS స్కీమ్లను కాపీ చేసింది
నేను చెప్పినట్టు ప్రచారం, సభలు చేయండి మనం గ్యారంటీగా గెలుస్తాం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయండి.. 40 లక్షల రూపాయలు ఖర్చు చేయండి.. ఎన్నికల తరువాత మీరు గెలవక పోతే మీరు ఖర్చు చేసిన మీ 40 లక్షలు మీకు ఇస్తాను అని ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీకు ఎన్నికల్లో ఖర్చు చేసిన ఆ 40 లక్షలు తిరిగి ఇవ్వమంటే.. నేను ఇచ్చేస్తాను అని కేఏ పాల్ పేర్కొన్నారు.
Read Also: Israel-Hamas War: హమాస్ వద్ద బందీలుగా 210 మంది.. ఇజ్రాయిల్ సైన్యం ప్రకటన..
కుటుంబ, కుల, అవినీతి, అక్రమ, అప్పుల పాలనకు చరమగీతం పాడుదామని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లీం ప్రజలు అందరు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయా పార్టీల దగ్గరకు వెళ్లి మోత్కుపల్లి నర్సింహుల లాగా సూసైడ్ చేసుకోకండి అని పాల్ తెలిపారు. ప్రజాశాంతి పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు ఉందని చెప్పుకొచ్చారు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.