Site icon NTV Telugu

KA Paul: ప్రజలు గెలిపిస్తానంటే సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తా

Pal

Pal

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థులతో సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిమాణాలపై విద్యార్థులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రవళిక ఆత్మహత్యకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. ప్రవళిక ఆత్మహత్య బాధాకరం, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దన్నారు కేఏ పాల్. ఇదిలా ఉంటే.. అక్కడ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణ బాగుపడాలని అందరూ మద్దతు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణకు మద్దతు ఇవ్వాలని తనను కోరినట్లు పేర్కొన్నారు. తనను అందరూ సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని అడుగుతున్నారని అన్నారు.

Read Also: Viral Video : విమానాన్ని చుట్టుముట్టిన దోమల దండు.. ఎక్కడంటే?

తెలంగాణలో పాల్ రావాలి.. పాలన మారాలని కేఏ పాల్ అన్నారు. మీరందరూ మద్దతు ఇచ్చి తనను గెలిపించుకుంటామని అంటే తప్పకుండా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని కేఏ పాల్ తెలిపారు. అలా కాకుండా దొంగలు, గజ దొంగలు, కుటుంబ పాలన కావాలి అంటే మీ ఇష్టం అని పేర్కొన్నారు. 2014లో ధనవంతంగా ఉన్న రాష్ట్రం.. 2023 వచ్చే సరికి అప్పుల్లో ఉందని చెప్పారు. ఇది తాను ఊహించలేదని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి 7 వేల కంపెనీలు తీసుకుని రాగలనని తెలిపారు. మన దేశంలో ఎంతో చైతన్యవంతులు ఉన్నారని.. కానీ వారికి మంచి చేసే రాజకీయ నాయకులు లేరని కేఏ పాల్ అన్నారు.

Read Also: Bandi Sanjay: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ గురించి బండి సంజయ్ ఏమన్నారో తెలుసా..!

Exit mobile version