Site icon NTV Telugu

KA Paul: పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై కేఏ పాల్ హాట్ కామెంట్స్..

Ka Poul

Ka Poul

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసేంది వారాహి యాత్ర కాదు నారహి యాత్ర అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. పవన్ విశాఖలో నారాహి యాత్రను ఉపసంహరించుకోవాలి.. పవన్ కళ్యాణ్ ను చూసి మోడీ మొహం చాటేశారు.. పవన్ మీద ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉన్నాయా..? అని కేఏ పాల్ అడిగారు. విభజన హామీల కోసం కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు అని ఆయన అడిగారు. దశావతారంలాగా పవన్ కళ్యాణ్ పది పార్టీలు మార్చారు.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి.. ప్రజాశాంతి పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తాను అని పాల్ తెలిపారు.

Read Also: Viral News: ఏంటీ ఈ పాడు పని.. తినడానికి ఇంకేం దొరకలేదా..!

వారాహి యాత్రకు వెళ్తే 500 ఇస్తున్నారు.. చంద్రబాబు యాత్రకు వెళ్తే 1000 రూపాయలు ఇస్తున్నారు అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అయిన పవన్ సభలకు జనాలు రావడం లేదు.. చంద్రబాబు పులివెందుల వెళ్లి 50 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నేను పులిని అని చెప్పుకుంటున్నారు.. చంద్రబాబు పులి కాదు పిల్లి.. కేసీఆర్ తరిమేస్తే భయపడి అమరావతి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని కేఏ పాల్ విమర్శించారు. లోకేష్ పప్పను సీఎం చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు అని కేఏ పాల్ ఎద్దేవా చేశాడు.

Read Also: PM Modi: ఎన్డీఏ కూటమి ఎంపీలతో ప్రధాని మోడీ సమావేశం.. గెలుపు సూత్రాలు ప్రకటన

మరోవైపు.. విశాఖపట్నంలోని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ ముందు ముందు టిడిపి కార్యకర్తలు ధర్నాకు దిగారు. చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కేఏ పాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.. అమరావతిలో వేల కోట్లు దోపిడీ చేశారు.. పప్పు లోకేష్ కే ఓటు అంటూ ఫ్లెక్సీ పెట్టి మీడియా సమావేశాన్ని పాల్ నిర్వహించడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దద్దమ్మలు చంద్రబాబు మాటలు విని పోలీసులపై దాడులు చేస్తున్నారు.. పోలీసులపై టీడీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.. పవన్ కళ్యాణ్ చేసేది వారాహి కాదు నారాహి యాత్ర.. పప్పును సీఎం చేయడమే పవన్ లక్ష్యం అనే వ్యాఖ్యలను కేఏ పాల్ ఉపసంహరించుకోవాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

Exit mobile version