KA Paul : నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగదు.. జరగనివ్వను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KA Paul Fires on TRS and BJP
మునుగోడులో ప్రచారం జోరుమీదుంది. రోజు రోజుకు ప్రచారంలో వేడి పెరుగుతోంది. అయితే.. నిన్నటితో మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే.. నేడు స్ర్కూట్ని ప్రక్రియ జరుగుతోంది. నల్లగొండ జిల్లా చండూరు రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఈ స్క్రూట్ ని జరుగుతోంది. అయితే.. ఈ స్క్రూట్నీకి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ ఆధ్వర్యంలోనే నడుస్తుందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నా తర్వాత వచ్చిన వారిని లోపలికి పంపించారని, నా నామినేషన్ తిరస్కరిస్తే ఎన్నికనే జరగదు… జరగనివ్వనని ఆయన వ్యాఖ్యానించారు. పది తులాల బంగారం ఇచ్చినా తీసుకొని ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.
Also Read
- 7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
- Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
కేసీఆర్ కమ్యూనిస్టులను కొనేశాడని, మునుగోడులో నన్ను గెలిపిస్తే ఉచిత విద్య వైద్యం, నిరుద్యోగులకు, ఉపాధి, ఉద్యోగం, రైతులకు రుణమాఫీ, మంచినీరు, రోడ్లు కాలేజీ యూనివర్సిటీ ఆరు నెలల్లో చేసి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ మారిన సర్పంచ్ లకు రెండు కోట్లు ఇస్తున్నారని, మునుగోడు ప్రజలు తెలివితేటలు వాడి ఇచ్చిన డబ్బు తీసుకొని నన్ను గెలిపించండని ఆయన అన్నారు. బీజేపీకి బీ పార్టీగా బీఆర్ఎస్ కేసీఆర్ పెట్టాడని, అభివృద్ధి చేయనందుకే గల్లి గల్లీకి ఓ కీలక నేతను అధికార పార్టీ బరిలోకి దింపిందన్నారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం కంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండడమే బెటర్ అని, రేవంత్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 ప్రో 5G లాంచ్‌కు రెడీ?.. 8GB RAM, 256GB స్టోరేజ్.. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!