Site icon NTV Telugu

KA Paul: బాబూ.. మా బడుగుల ప్రాణాలకు విలువ లేదా?

Chandrababupaul

Chandrababupaul

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నిన్నటి చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభకు 50-60 వేల మంది జనం వచ్చారు. మందు, ముక్క, బిర్యానీలు ఇచ్చి జనాన్ని పశువులను తోలినట్టు తోలారు. రెండు వేల మంది కూడా పట్టని ప్రాంతంలో వేల మందితో రోడ్ షో ఎలా నిర్వహిస్తారు..? ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబుదే బాధ్యత అన్నారు కేఏ పాల్. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ. 50 వేలు.. రూ. లక్ష అంటూ చంద్రబాబు చదివితే సరిపోతుందా..? అన్నారు.

Read ALso: KCR Condoles Harinatha Rao : మంత్రి కేటీఆర్ మామకు నివాళులర్పించిన కేసీఆర్

చంద్రబాబు కొడుకు.. మనవడు ప్రాణాలకు ఇదే విలువ ఇస్తారా..? చంద్రబాబు బిడ్డల ప్రాణాలకు లక్షల కోట్ల విలువా..? మా బడుగుల ప్రాణాలకు విలువ లేదా..? అని మండిపడ్డారు పాల్. చంద్రబాబు ఎనిమిది మందిని మర్డర్ చేశారు. చంద్రబాబుపై హత్య కేసు నమోదు చేయాలి. నైతిక బాధ్యత వహించి చంద్రబాబు టీడీపీకి రాజీనామా చేయాలి.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలకు ఇప్పటికైనా బుద్జి వచ్చిందా..?రూ. 250 బిర్యాని పొట్లానికి ఎగబడతారా..?చంద్రబాబుపై హత్య కేసు నమోదు చేసేందుకు పోలీసులకు 72 గంటల సమయం ఇస్తున్నాను.

లేకుంటే కందుకూరు ఘటనపై కోర్టుకు వెళ్తాం.చంద్రబాబు మీటింగులకు పోలీసులు అనుమతివ్వకూడదు.చంద్రబాబు దోచుకున్న ప్రజాధనం రూ. 6 లక్షల కోట్లు.ఏపీలోని పేదలకు రూ. 2 లక్షల చొప్పున తన అవినీతి ధనాన్ని పంచి పెట్టొచ్చుగా..?చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేయాలి.. విచారణ చేపట్టాలి.చంద్రబాబు సభలకు అనుమతిస్తే డీజీపీ పైనా కేసు వేస్తా అన్నారు కేఏ పాల్.

Read Also: Today (29-12-22) Stock Market Roundup: సెకండాఫ్‌ బాగుంది

Exit mobile version