KA Paul : నామినేషన్లకు రేపే చివరి తేదీ అయిన సింబల్ ఇవ్వడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారన్నారు. సెప్టెంబర్ లోనే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన ఇంతవరకు గుర్తు కేటాయించలేదని, పార్టీ యాక్టివ్ గా ఉన్న యాక్టివ్ గా లేదని చెప్తున్నారన్నారు. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. పోటీ చేయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కి కూడా గుర్తు కేటాయించారు కానీ మాకు కేటాయించడం లేదన్నారు. తెలుగు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సర్వేలు స్పష్టంగా చెప్తున్నాయని, నామినేషన్లకు రేపే చివరి తేదీ అయిన సింబల్ ఇవ్వడం లేదన్నారు. మా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తే సింబల్ ఏంటి అని అడుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘నాకు ఎందుకు ఇంతలా నరకం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. సింబల్ కోసం నిరాహారదీక్ష చెయ్యాలా? హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయించారో చెప్పడం లేదు. ఆరు నెలలుగా ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప కేటాయించడం లేదు. చట్టాలు మారాలంటే నాలాంటి వాడు ఎంపీ అవ్వాలి. నా పోరాటంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేసాను. ప్రజా శాంతి పార్టీకి గుర్తు వెంటనే కేటాయించి, నామినేషన్లకు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజా శాంతి పార్టీ కి సింబల్ ఎందుకు ఇవ్వడం లేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి.
తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు, ప్రచారం చేసేందుకు సమయం కేటాయించాలనే నేను పోటీకి దూరంగా ఉన్నా. గొర్రెలు కసాయి వారిని నమ్మినట్లే ప్రజలు అవినీతిపరులను ఎన్నుకుంటున్నారు.’ అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
Also Read
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
తాజావార్తలు
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
-
BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
-
NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్‌ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..