NTV Telugu Site icon

KA Paul : నామినేషన్లకు రేపే చివరి తేదీ అయిన సింబల్ ఇవ్వడం లేదు

Ka Paul

Ka Paul

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కలిశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారన్నారు. సెప్టెంబర్ లోనే అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన ఇంతవరకు గుర్తు కేటాయించలేదని, పార్టీ యాక్టివ్ గా ఉన్న యాక్టివ్ గా లేదని చెప్తున్నారన్నారు. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారో, ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడో అర్థం కావడంలేదని ఆయన వ్యాఖ్యానించారు. పోటీ చేయని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కి కూడా గుర్తు కేటాయించారు కానీ మాకు కేటాయించడం లేదన్నారు. తెలుగు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సర్వేలు స్పష్టంగా చెప్తున్నాయని, నామినేషన్లకు రేపే చివరి తేదీ అయిన సింబల్ ఇవ్వడం లేదన్నారు. మా పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తే సింబల్ ఏంటి అని అడుగుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా.. ‘నాకు ఎందుకు ఇంతలా నరకం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. సింబల్ కోసం నిరాహారదీక్ష చెయ్యాలా? హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయించారో చెప్పడం లేదు. ఆరు నెలలుగా ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప కేటాయించడం లేదు. చట్టాలు మారాలంటే నాలాంటి వాడు ఎంపీ అవ్వాలి. నా పోరాటంతోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేసాను. ప్రజా శాంతి పార్టీకి గుర్తు వెంటనే కేటాయించి, నామినేషన్లకు మరో రెండు రోజులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ప్రజా శాంతి పార్టీ కి సింబల్ ఎందుకు ఇవ్వడం లేదో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి.
తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు, ప్రచారం చేసేందుకు సమయం కేటాయించాలనే నేను పోటీకి దూరంగా ఉన్నా. గొర్రెలు కసాయి వారిని నమ్మినట్లే ప్రజలు అవినీతిపరులను ఎన్నుకుంటున్నారు.’ అని కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు.